వుహాన్ ఓపెన్ కైవసం
ఫైనల్లో జెంగ్‌పై విజయం
వుహాన్: మహిళల ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి అరీనా సబెలెంకా తన ఆధిపత్యాన్ని స్పష్టంగా కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన వుహాన్ ఓపెన్ టోర్నీలో సబెలంకా చాంపియన్‌గా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంకా (బెలారస్) 6-3, 5-7, 6-3తో ఐదో సీడ్ జెంగ్ (చైనా)పై విజయాన్ని అందుకుంది.
తొలి సెట్‌ను సొంతం చేసుకున్న సబలెంకా తన ప్రత్యర్థికి రెండో సెట్‌ను కోల్పోయింది. అయితే కీలకమైన మూడో సెట్‌లో మాత్రం ఫుంజుకొని సెట్‌ను సునాయాసంగా కైవసం చేసుకుంది. రెండు గంటల పాటు సాగిన మ్యాచ్‌లో సబెలంకా ఏడు ఏస్‌లతో పాటు 7 బ్రేక్ పాయింట్లు సొంతం చేసుకుంది.
5 ఏస్‌లు సంధించిన జెంగ్ 8 డబుల్ ఫాల్ట్స్ తో మూల్యం చెల్లించుకుంది. ఇక మహిళల డబుల్స్ టైటిల్‌ను క్రొమచెవా జంట సొంతం చేసుకుంది. ఫైనల్లో ఈ జోడీ పెగులా-ముహమ్మద్ జంటను ఓడించి చాంపియన్స్‌గా నిలిచారు.