08-04-2025 01:28:07 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 1 తరగతు ల్లోని విద్యార్థులకు బుధవారం నుం చి 17 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ థూ (ఎస్‌ఏ2) పరీక్షలు జరగనున్నాయి. అయితే తొలుత 6 తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 1 తరగతి విద్యార్థులకు మాత్రం ఈనెల 11వ తేదీ నుంచి షెడ్యూల్ ప్రకారం ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు ముగిశాయి.
ఇక 1 తరగతి విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. 1 తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.45 వరకు, తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9 గం టల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. చివరి రోజు 23న పేరెంట్ టీచర్స్ సమావేశంతో విద్యాసంవత్సరం ముగుస్తుంది.