న్యూఢిల్లీ: గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఎస్‌అండ్‌పి సోమవారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.8 శాతానికి తగ్గించింది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఅంచనా వేసిన 7.2% కంటే తక్కువగా ఉండటం విశేషం. అధిక వడ్డీ రేట్లు, తక్కు వ ఆర్థిక ఉద్దీపన డిమాండ్ వంటి పలు అంశా ల నేపథ్యంలో తగ్గించినట్లు తెలిపింది. ఆసియా పసిఫిక్ ప్రాంత ఆర్థిక దృక్పథంలో భాగంగాఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్ 2023-24 ఆర్థిక సంవత్సరంల్థో 8.2 శాతం వృద్ధితో భారతదేశ ఆర్థిక వృద్ధి పురోగమనంలో ఉంద ని తెలిపింది.అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోఆర్థిక వృద్ధి 6.8 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్లు ఎస్ అండ్ పీ వెల్లడిం చింది. దీంతోపాటు 2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాలకు వరుసగా 6.9 శాతం, 7 శాతం వృద్ధి రేటును అంచనా వేసింది.