calender_icon.png 9 February, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయేతర భూములకు రైతుబంధు?

09-02-2025 12:00:00 AM

1,973 ఎకరాలకు రూ.12 కోట్లు!

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి ౮ (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భద్రాద్రి జిల్లాలో వ్యవసాయేతర భూములకు రైతుబంధు కింద 1,973 ఎకరాలకు రూ.12 కోట్లు చెల్లించినట్లు తేటతెల్లమైంది. గత ప్రభుత్వం వ్యవసాయేతర భూములకు రైతుబంధు ఇచ్చిందన్న ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేపట్టింది.

ఈ సర్వేలో భద్రాద్రి జిల్లాలో వ్యవసాయం చేయని 1,973 ఎకరాలకు రైతుబంధు పడినట్టు గుర్తించారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున ఏటా సుమారు రూ.2 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తెలు  అక్రమ వెంచర్లకు, పెట్రోల్ బంకులకు, భవనాలకు, ఇసుక బ్యాంకులకు ఆరు సంవత్సరాల పాటు రైతుబంధు డబ్బులు చెల్లించారు.

దుమ్ముగూడెం, చర్ల  మండలాల్లో సుమారు 700 ఎకరాల వ్యవసాయ భూమి ప్రాజెక్టుల కింద రైతులు కోల్పోయారు. వాటిని సైతం అధికారులు సర్వే చేయకుండా రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమ చేశారు.

చుంచుపల్లి మండలంలో 182 ఎకరాలు, సూజాతనగర్ మం  165 ఎకరాలు, పాల్వంచ మండలంలో 254 ఎకరాలు, అశ్వారావుపేట మండలంలో 253 ఎకరాలు, అశ్వాపురం మండలంలో 119 ఎకరాల అక్రమ వెంచర్లకు రైతుబంధు చెల్లించారు. ఆరు సం  పాటు సుమారు రూ.12 కోట్లు ప్రజాధనం పక్కదారి పట్టింది.