నల్గొండ,(విజయక్రాంతి): పంట మార్పిడి పై పామాయిల్ సాగు విస్తరణ పెంచడం కోసం రైతులకు అవగాహన కల్పించేందుకు ఉద్యాన శాఖ, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతుల విజ్ఞాన యాత్ర హలియా పరిధిలో గురువారం చేపట్టారు. అనంతగిరి, కోదాడ, మునగాల, చిలుకూరు, నడిగూడెం, మోతె మండల లోని రైతులకు పామాయిల్ సాగు విస్తరణ పెంచడం కోసం హలియా పరిధిలోని పామాయిల్ వచ్చే తోటలను చూపించారు. పామాయిల్ సాగును చూసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తూ, ఇటువంటి పంటలు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పతాంజలి ఫుడ్స్ డివిజన్ అధికారి వెంకటేష్, ఫీల్డ్ అసిస్టెంట్లు, వివిధ మండలాల రైతులు పాల్గొన్నారు.