calender_icon.png 11 January, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో రుణాలు ఇవ్వండి

06-09-2024 04:49:00 PM

పేదల అభ్యున్నతికి తోడ్పాటు అందించండి 

పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి 

మహమ్మదాబాద్,(విజయక్రాంతి): అర్హులైన అందరికీ సకాలంలో రుణాలు అందించి వారి తోడ్పాటుకు సహకారం అందించాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహమ్మదాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల స్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.  రుణమాఫీ  తో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని బ్యాంకర్ల ను ఆదేశించారు. మహిళా సంఘాలకు క్రమం తప్పకుండా రుణాలు అందించాలని, బ్యాంకులో అప్పు తీర్చిన మహిళా సంఘాలకు సకాలంలో రుణాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగదమని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కే.ఎం నారాయణ. PACS చైర్మన్ లక్ష్మీనారాయణ.గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి. శాంతి రంగయ్య. ఎంపీడీవో దేవన్న. తాసిల్దార్.కే.రాజేందర్ రెడ్డి.రఘవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.