calender_icon.png 11 January, 2025 | 2:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అవగాహన కల్పించడానికి రైతునేస్తం

04-12-2024 02:40:37 AM

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యవసాయ, అనుబంధ శాఖ కార్యకలపాలపై రైతులకు అవగాహన కల్పించడానికి  ప్రతి మంగళవారం రైతునేస్తం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ సంచాలకులు డా. గోపి తెలిపారు. యాసంగిలో స్వల్పకాలిక వరి రకాల సాగు, నారుమడి యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించామన్నారు.

ఈ సీజన్‌లో రైతులు  స్వల్పికాలిక రకాలను మాత్రమే సాగు చేయాలని సూచించారు. వరి నాడు మడులలో తరుచుగా కనిపించే జింక్ ధాతువు లోపానికి తీసుకోవాల్సిన చర్యలను డా. చంద్రమోహన్ వివరించారు.కార్యక్రమంలో 566 రైతు వేదికల నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు  సిబ్బంది, ఎలక్ట్రానిక్ విభాగం, రాజేంద్రనగర్ వ్యవసాయ విద్యాలయం అధికారులు, రైతులు పాల్గొన్నారు.