calender_icon.png 20 April, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి రైతు మహోత్సవం

20-04-2025 09:01:18 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజులపాటు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో  రైతు మహోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

మహోత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొని వారు పండించిన  వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తుల ప్రదర్శిస్తారని, సహజ పద్దతుల్లో పంటల సాగు, యాంత్రీకరణ, అధునాతన వంగడాలు పసుపు ఆధారిత ఉత్తుత్తులతోపాటు, పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు తదుపర అంశాలకు సంబంధించి సుమారు 136 స్టాళ్లను వ్యవసాయశాఖ ఏర్పాటు చేయనుంది.