హామీలు ఇచ్చి మోసం చేస్తున్న రేవంత్ సర్కార్ మెడల్ వంచుతాం
రేవంత్ సర్కార్ బిజెపితో కుమ్మక్కు కేటీఆర్ పై ఈ కార్ కేసు బనాయించారు
తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
యాదాద్రి భువనగిరి,(విజయక్రాంతి): ఈనెల 21న నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన రైతు మహా ధర్నా కార్యక్రమం(Rythu Maha Dharna Program)తో రేవంత్ సర్కార్ కు తమ సత్తా చూపిస్తామని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అన్నారు. ప్రజలకు ఎన్నికల సమయంలో హామీలిచ్చి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసం దగా చేస్తూ కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి ప్రజల ముందు దోషిగా నిలబెడతామని అన్నారు. ఆదివారం మోత్కూర్ లో మీడియా సమావేశమైన మాట్లాడుతూ లక్షలాదిమంది తరలి వచ్చే మహా ధర్నా చూసి రాష్ర్ట ప్రభుత్వ గుండెలు గడగడలాడుతాయని అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యే మహా ధర్నాకు లక్షలాదిమంది తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఓటుకు నోటు కేస్ లో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అడ్డగోలుగా హామీలు ఇచ్చి అందరిని మోసం చేస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ప్రస్టేషన్ లో తమ పార్టీ కార్యాలయాలపై భౌతిక దాడులు చేస్తున్నారు. తాము తల్చుకుంటే కాంగ్రెస్ నాయకులు ఒక్కడు కూడా మిగలడు. మేము అధికారంలో ఉన్నప్పుడు అందరిని గౌరవించాం. సహనంతో గౌరవంగా అందరిని అక్కున చేర్చుకున్నామన్నారు. మిటింగ్ ఏది పెట్టినా కేసీఆర్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు రేవంత్. ముఖ్యమంత్రి అయినంక కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. డవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా బిజెపితో కుమ్మకై కేటీఆర్ పై ఈ కార్ రేస్ కేస్ బనయించారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అంటేనే మోసం దగా,, ప్రజలకు రేవంత్ ఫై విశ్వాసం పోయింది...15 వేలు రైతు భరోసా ఇస్తా అన్నారు మాట తప్పారు...ముఖ్యమంత్రి హోదాలో కూడా రేవంత్ దొంగ చెక్కులు ఇచ్చి పచ్చి మోసం చేసాడు...రుణమాఫీ అంతా బోగస్.. అన్ని అబద్ధాలే..6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి... అవి నింపే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు...28 సార్లు ఢిల్లీకి పోయి ఖాళీ చేతులతో వచ్చారు.... తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టారు అని మాజీ ఎమ్మెల్యే నిశితంగా విమర్శించారు.