calender_icon.png 30 January, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుభరోసా విడుదల.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు

27-01-2025 05:05:30 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రజా ప్రభుత్వం అందిస్తున్న  రైతుభరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కొనసాగుతోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. తొలివిడతలో మండలానికొక గ్రామంలో రైతుభరోసా సొమ్ము విడుదల చేసి, ఇవాళ 4,41,911 రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 577 మండలల్లో 9,48,333 ఎకరాలకు రూ.563 కోట్ల నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఆయన ప్రకటించారు. ఇక నుంచి ఏడాదికి ఎకరానికి రూ.10 వేలు నుంచి రూ.12 వేలకు పెంచిన ఆర్థిక సహయం రైతుల ఖాతాల్లో జమ అవుతూందని మంత్రి తుమ్మల తెలిపారు.  దీంతో రైతుభరోసా సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.