హైదరాబాద్: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రైతు భరోసా(Rythu Bharosa ) విధి విధానాల పైన జరుగుతున్న కేబినెట్ సబ్ కమిటీ భేటీ సమావేశం ముగిసింది. పంట పండించే ప్రతీ రైతుకు రైతు భరోసా ఇవ్వాలని ఈ భేటీలో చర్చించారు. రైతు భరోసాకు ఐటీ చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని కమిటీ అభిప్రాయం తెలిపింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించనున్నారు.
రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనుంది. ఎల్లుండి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం (Cabinet Sub Committe Meeting) ఈ సబ్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా వ్యవహరించగా.. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు.