calender_icon.png 16 January, 2025 | 11:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ ఉద్యమమైన భూమికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుంది

16-01-2025 07:26:31 PM

రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి...

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే రైతు భరోసా వర్తిస్తుందని భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి(Revenue Divisional Officer Krishna Reddy) అన్నారు. గురువారం ఆలేరు మండలము టంగుటూరు గ్రామములో రైతు భరోసా రికార్డులను పరిశీలించారు. వ్యవసాయహేతర (సేద్యం) లేని భూమికి రైతు భరోసా వర్తించడం జరగదని అన్నారు. సర్వే సిబ్బందికి ఎప్పటికి అప్పుడు సర్వే వివరములు తప్పకుండ రిజిస్టర్ లో నమోదు చేయాలనీ ఆదేశించారు. ఇట్టి సర్వేలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, ఆలేరు మండల తహసిల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, గ్రామ పంచాయతీ అధికారి పాల్గొన్నారు.