calender_icon.png 2 November, 2024 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబంధు ఇవ్వకుండా ముంచారు

02-11-2024 12:00:00 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని, వానాకాలం వరికోతలు సాగుతున్నా, ఇప్పటివరకు రైతుబంధు రూ. 15 వేలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు.

శుక్రవారం ఎక్స్ వేదిక స్పందిస్తూ రైతులు కల్లాల్లో  కన్నీళ్లు పెడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కనీసం హార్వెస్ట్ చేసిన పంటలను కొనుగోలు చేయడం లేదని, దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈసీజన్‌లో 91.28లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని, అక్టోబర్ నెలలో 8.06లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కానీ అక్టోబర్ 28 నాటికి 913 మంది రైతుల నుంచి కేవలం 7,629 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారన్నారు.

గాలిమాటల గ్యారెంటీలిస్తే మొదటికే మోసం

రేవంత్ సర్కార్ గాలి మాటల గ్యారెంటీలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొనారు. శుక్రవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను ఎక్స్‌వేదికగా ప్రశ్నిస్తూ కర్ణాటకలో ఐదు గ్యారంటీలు ప్రకటించినప్పుడు ఆ రాష్ర్ట బడ్జెట్ గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించినప్పుడు రాష్ట్ర బడ్జెట్ గురించి తెలియదా అని నిలదీశారు.