calender_icon.png 17 January, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిబాకినా రయ్ రయ్

17-01-2025 12:07:25 AM

మూడో రౌండ్‌కు కజకిస్తాన్ స్టార్

  • స్వియాటెక్‌తో రాడుకాను అమీతుమీ
  • సిన్నర్, టేలర్‌కు సులువైన విజయాలు
  • ఆస్ట్రేలియన్ ఓపెన్

  • మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో కజకిస్తాన్ సుందరి ఎలీనా రిబాకినా రయ్ రయ్‌మంటూ దూసుకెళ్తుండగా.. ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ సులువైన విజయం సాధించి మూడో రౌండ్‌లో ఎమ్మా రాడుకానుతో అమీతుమీకి సిద్ధమైంది. నాలుగో సీడ్ జాస్మిన్ పవోలిని అలవోక విజయం సాధించారు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్‌తో పాటు నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్.

సునాయాస విజయాలతో మెరిశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రిబాకినా (కజకిస్తాన్) 6 6 అమెరికాకు చెందిన ఇవా జోవిక్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో 4 ఏస్‌లు సంధించిన రిబాకినా 29 విన్నర్లతో ఆధిపత్యం ప్రదర్శించింది. 10 విన్నర్లకే పరిమితమైన జోవిక్ ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయింది.

మరో మ్యాచ్‌లో స్వియాటెక్ (పోలండ్) 6 6 స్రమకోవా (స్లొవేకియా)ను చిత్తు చేసింది. కేవలం గంట పాటు సాగిన మ్యాచ్‌లో స్వియాటెక్ దూకుడు చూపించింది. బ్రిటన్ సుందరి ఎమ్మా రాడుకాను 6 7 అనిసిమోవాపై విజయంతో మూడో రౌండ్‌కు చేరుకుంది. మూడో రౌండ్‌లో స్వియాటెక్‌తో రాడుకాను తలపడనుంది. మిగిలిన మ్యాచ్‌ల్లో పవోలిని, జేబుర్, నవ్వారో, స్వితోలినా విజయాలు సాధించి తదుపరి రౌండ్‌లో అడుగపెట్టారు.

సిన్నర్ దర్జాగా..

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ జానిక్ సిన్నర్ ఎదురులేకుండా దూసుకెళ్తున్నాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో సిన్నర్ 4 6 61 స్కూల్‌కాటే (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. దాదాపు మూడు గంటల పాటు సాగిన పోరులో సిన్నర్ 14 ఏస్‌లు, 42 విన్నర్లు సంధించగా.. 13 ఏస్‌లు కొట్టిన స్కూల్ కాటే 52 అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

మరో సింగిల్స్‌లో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 6 6 6 క్రిస్టియన్ గారిన్ (చిలీ)పై విజయం సాధించగా.. 8వ సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6 6 6 క్వాలిఫయర్ బోయర్‌పై గెలుపొందాడు. మిగిలిన మ్యాచ్‌ల్లో రూనే, మిచెల్‌సెన్, కచనోవ్ ముందంజ వేశారు.