16-04-2025 04:47:44 PM
కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధిలో పేరువంచ నీటి సమస్యకు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు అనే కధనానికి స్పందించి గ్రామ పంచాయితీలో ఉన్న చేతిపంపులు సుమారుగా 28 అందులో వాడుకలో ఉండి చిన్న చిన్న రిపేర్ లతో పని చెయ్యకుండా మరుగున పడిన చేతి బోర్లను బుధవారం రూరల్ వాటర్ సప్లై అధికారి చక్రవర్తి గ్రామంలో అంబేద్కర్ నగర్, యాదవ బజారు, గౌడ బజారు, నాయుడు బజారు, మెయిన్ రోడ్డు ఎన్టీఆర్ కాలనీ లలో చేతి పంపులు పరిశీలించండం జరిగింది.
ఎన్టీఆర్ కాలనీలో నీటి సమస్య ఉంది అనే వార్త కధనానికి స్పందించి ఆర్. డబ్ల్యు.యస్ ఏఈ చక్రవర్తి నేరుగా వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి 16 బోర్లను చిన్న చిన్న రిపేరులు గమనించి అట్టి రిపేర్ లని పూర్తి చేసి ఆ బోర్లని వాడుక లోకి తీసుకోని వచ్చి ఈ ఎండాకాలం నీటి ఎద్దడి తీరుస్తామని అలాగే ఎన్టీఆర్ కాలనీ ఆర్ అండ్ బి రోడ్డు పక్కన ఉన్న బోర్ ని ప్లస్ అవుట్ చేసి దానికి బోర్ బిగించి ఎన్టీఆర్ కాలనీకీ త్రాగు, వాడుక నీరు అందిచడానికి కృషి చేస్తాము అని అలాగే హైస్కూల్ వద్ద ఉన్న వాటర్ ట్యాంకుకు పక్కనే ఉన్న పల్లె పకృతి వనంలో ఉన్న బావిలో ఉన్న మోటార్ ని ఆ వాటర్ ట్యాంక్ కు కనెక్ట్ చేసి ఆ ట్యాంక్ ద్వారా గ్రామం లో సకానికి పైగా నీటి సమస్య తీరుస్తాము ఆర్. డబ్ల్యు.యస్ ఏ.ఈ చక్రవర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో అయన వెంట పేరువంచ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మండల ఉపాధ్యక్షలు కీసర శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.