calender_icon.png 22 February, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశమొత్తం సేవలందించేలా ‘ఆర్‌వీ టూర్స్’ విస్తరణ

18-02-2025 01:40:10 AM

* చైర్మన్ ఆర్‌వీ రమణ

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(విజయక్రాంతి): దేశ నలుమూలలా ప్రయాణికులకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా ఆర్‌వీ టూర్స్ సంస్థలను విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ ఆర్‌వీ రమణ పేర్కొన్నారు. కొన్నిరోజులుగా తమ సంస్థ ఆధ్వర్యంలో ఆయా నగరాల్లో నిర్వహించిన ట్రావెల్ ఎక్స్‌పో  అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. ఈ ఎక్స్‌పో ద్వారా వేలాది మంది యాత్రికులు తమకు నచ్చిన టూర్ ప్యాకేజీలను బుక్ చేసుకొని భారీ డిస్కౌంట్లను పొందారని తెలిపారు.

సోమవారం - కూకట్‌పల్లిలో సంస్థ హెడ్ ఆఫీస్‌లో చైర్మన్ ఆర్‌వీ రమణ, ముఖ్య అతిథులు, కస్టమర్ల సమక్షంలో నిర్వహించిన లక్కీ డిప్ లైవ్ కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు.  -పీ లత  యూరప్ టూర్ (కూపన్- నెంబర్ 0680), కుర్రే నా  దుబాయ్ టూ  (కూ.నెం.1630 ), పీ మాధవి శ్రీలంక టూర్  ఆళ్ల శివకుమారి బ్యాంకాక్ టూర్(కూ.-నెం.1141), ఎన్ స్వరూప టూర్ (కూ.-నెం.3326), దోమ గాయత్రి  చార్‌ధామ్ టూర్ (కూ.-నెం.2   కాంతల మాధవి తమిళనాడు టూర్ (కూ.నెం.  చీడల్ల నరసింహరావు టూర్ (కూ.-నెం.2165), పారిపల్లి శ్వేత ఒడిశా టూర్ (కూ.నెం  సబ్బె  సోమిరెడ్డి కాశీ -అయోధ్య టూర్(కూ.నెం. 2266) విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ ఆర్‌వీ సంస్థ ద్వారా చక్కటి సౌకర్యాలను సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే కాకుండా భారీ డిస్కౌంట్లతో పాటు ఇలాంటి టూర్లను ఉచితంగా అందిచండం హర్షణీయమన్నారు.