calender_icon.png 7 January, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 ఏండ్లుగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సేవలు

03-01-2025 02:20:26 AM

జనవరి 31 వరకు ట్రావెల్స్ ఎక్స్‌పో మెగా మేళా

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 2 (విజయక్రాంతి): ట్రావెల్ రంగంలో దాదాపు 25 ఏండ్లుగా తెలుగు, కన్నడ ప్రజలకు అపార సేవలు అందిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ఆధ్వర్యంలో ట్రావెల్ ఎక్స్‌పో  2025 మెగా మేళాను నిర్వహిస్తున్నట్టు ఆ సంస్థ అధినేత ఆర్వీ రమణ తెలిపారు.

గతేడాది డిసెంబర్ 16 నుంచి ఈ నెల 31 వరకు హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కరీంనగర్, ప్రొద్దుటూరులో దాదాపు 45  రోజులపాటు నిర్వహించనున్న ఈ మేళాలో కష్టమర్లకు అతి తక్కువ ధరలలో దాదాపు వందకుపైగా దేశ, విదేశీయ టూర్లపై బంపర్ ఆఫర్లను ప్రకటించినట్టు పేర్కొన్నారు.

ఈ ఎక్స్‌పోలో ముందుగా టూర్ బుక్ చేసుకున్నవారికి   లక్కీడిప్ ద్వారా పది మంది విజేతలను కూడా ప్రకటించి ఉచిత టూర్లను అందించనున్నట్టు ప్రకటించారు. కష్టమర్ల కోసం సరికొత్త డిజైన్ చేసిన దేశీయ టూర్ ప్యాకేజీలపై 10 శాతం తగ్గింపు, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై 5 శాతం భారీ డిస్కౌంట్స్ కల్పిస్తున్నామని చెప్పారు.

లక్కీ డిప్ విజేతలకు మొదటి బహుమతి యూరప్ టూర్, రెండో బహుమతి దుబాయ్ టూర్, మూడో బహుమతి శీలంక టూర్, నాలుగో బహుమతి బ్యాంకాక్ టూర్, ఐదో బహుమతి  శ్రీనగర్ టూర్ , ఆరో బహుమతి చార్ధామ్ టూర్, ఏడో బహుమతి తమిళనాడు టూర్, ఎనిమిదో బహుమతి  కర్ణాటక టూర్, తొమ్మిదో బహుమతి  ఒడిషా టూర్, పదో బహుమతి కాశీ- అయోధ్య టూర్లను బహుమతిగా అందించనున్నామని చెప్పారు.

ఈ ఏడాదిలో జరిగే మహాకుంభమేళా, సరస్వతీ పుష్కరాలను యాత్రికులు సౌకర్యవంతంగా చేసుకునేలా అద్భుత ఏర్పాట్లతో అందరికి అందుబాటులో ఉండే ధరలలో టూర్ ప్యాకేజీలను సిద్ధం చేశామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.