30-04-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్ ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఐఏఎస్‌ల బదిలీల్లో జీహెచ్‌ఎం సీ కమిషనర్‌గా పని చేసిన ఇలంబర్తిని ఎంఏయూడీ(హెచ్‌ఎండీఏ పరిధి)కార్యదర్శిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో ఆర్వీకర్ణన్ నియమితులయ్యారు.
బదిలీపై వెళుతున్న ఇలంబర్తి నుంచి మంగళవారం అధికారికంగా ఆర్‌వీ కర్ణన్ బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇంతకు ముందు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సేవలందించిన ఆర్‌వీ కర్ణన్ హైజీన్ ప్రమాణాలను ఉల్లంఘించిన రెస్టారెంట్లు, పబ్‌లు, ఐస్‌క్రీమ్ పారుర్లు తదితర ఆహారసంస్థలపై దాడులు నిర్వహించడంతో పాటు, ప్రజల్లో ఆహార భద్రతపై అవగాహన పెంచారు. గడిచిన పది నెలల్లో జీహెచ్‌ఎంసీ కమిషనర్లుగా నలుగురు అధికారులు మారడం గమనార్హం.