calender_icon.png 11 January, 2025 | 8:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాప్-10లో రుతురాజ్

11-07-2024 12:10:00 AM

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్

దుబాయ్: జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటారు. బుధవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో రుతురాజ్ 13 స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. జింబాబ్వేతో రెండో టీ20లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రింకూ సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 39వ స్థానంలో నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపిన అభిషేక్ శర్మ (75వ స్థానం) తొలిసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో చోటు సంపాదించాడు. ట్రావిస్ హెడ్ (844), సూర్యకుమార్ (821), ఫిల్ సాల్ట్ (797), బాబర్ ఆజమ్(755), మహ్మద్ రిజ్వాన్ (746) వరుసగా టాప్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఒక్కడే టీమిండియా తరఫున టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్ (644 పాయింట్లతో) 9వ స్థానంలో ఉండగా.. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా 11వ, 14వ స్థానాల్లో నిలిచారు. జింబాబ్వేతో సిరీస్‌లో బౌలింగ్‌లో అదరగొడుతున్న రవి బిష్ణోయి ఎనిమిది స్థానాలు ఎగబాకి 14వ స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో టీమిండియా (268 పాయింట్లు) టాప్ ర్యాంకులో నిలవగా.. ఆస్ట్రేలియా (256), ఇంగ్లండ్ (253) వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.