calender_icon.png 6 November, 2024 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇరాన్ శాటిలైట్లతో రష్యా రాకెట్

06-11-2024 12:55:25 AM

రష్యా, నవంబర్ 5: అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్ నుంచి విజయవంతంగా ప్రయోగించబడిన సోయుజ్ రాకెట్‌లో ఇరాన్‌కు చెందిన శాటిలైట్లు ఉన్నాయి. దీంతో రెండు దేశాల బంధం మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఉపగ్రహాలు అయినోస్పియర్ పొరను పర్యవే క్షిస్తాయి. అంతరిక్ష వాతావరణ సూచనలు తెలుసుకోవడం కోసం అయినోస్పియర్‌ను అర్థం చేసుకోవడానికి ఎంతో అవసరం.

ఇకపోతే రష్యా మద్దతుతో ఇరాన్ ఇటీవలి కాలంలో ప్రయోగించిన ఎన్నో ఉపగ్రహ ప్రయోగాలు విఫలమైన వేళ.. ఈ ప్రయోగం విజయవంతం కావ డం రెండు దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. 2019లో ఇరాన్ ప్రయో గించిన లాంచ్ ప్యాడ్‌లో అగ్ని ప్రమా దం సంభవించడంతో ముగ్గు రు పరిశోధకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ అంతరిక్ష పరిశోధనల్లో కొంత వెనక్కు తగ్గింది.