తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న మాస్కో
సమర్థ్ధంగా ఎదుర్కొంటున్న ఉక్రెయిన్
కీవ్, నవంబర్ 26: రష్యా ఉక్రెయిన్పై దాడులను పెంచింది. ఉక్రెయిన్ లక్ష్యంగా రాత్రికి రాత్రే 188 డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్లలో కొన్నింటిని తాము సమర్ధంగా ఎదుర్కొన్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. దాపు 1000 రోజులుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్పై రష్యా ఇంత పెద్ద డ్రోన్ దాడి చేయడం ఇదే మొదలు. ‘ఇరాన్లో డిజైన్ చేసిన 188 డ్రోన్లు ప్రయో గించారు’ అని ఎయిర్ఫోర్స్ తెలిపింది.
కీవ్ మేయర్ విటాలీ నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాకుండా మాస్కో ‘ఇస్కందర్ క్షిపణులను కూడా ప్రయోగించింది’ అని ఎయిర్ఫోర్స్ తెలిపింది. ్ల కీలక నిర్మాణాలు ఈ దాడులకు కూలినట్లు ఆర్మీ వెల్లడించింది. సరిహద్దు ప్రాంతంలో ఉక్రెయిన్ ఉంచిన 39 డ్రోన్లను తమ సైన్యం ధ్వంసం చేసిందని రష్యా ప్రకటించింది.