calender_icon.png 28 October, 2024 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక.. వీసా లేకున్న రష్యా టూర్

28-10-2024 04:31:48 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): భారతీయ పర్యటకులకు రష్యా తీపికబురు చెప్పింది. భారతీయ పర్యటకులను ఆకర్షించేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుంది. భారత్ నుంచి రష్యా వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉందని అంచన వేసినట్లు మాస్కో సిటీ టూరిజం కమిటీ ఛైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ తెలిపారు. మాస్కో, ఇండియా నుండి ప్రయాణికులను ఆకర్షిస్తూనే ఉందని కోజ్లోవ్ చెప్పారు. దీంతో వీసారహిత పర్యటనలపై ఇరు దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వీసా ఫ్రీ సదుపాయం  2025 స్ప్రింగ్ సీజన్ ప్రారంభం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఎవ్జెనీ కోజ్లోవ్ ధ్రువీకరించారు. కాగా, 2024లో 28,500 మంది భారతీయ ప్రయాణికులు రష్యా రాజధానిని సందర్శించారు. 2023లో మాస్కోకు వెళ్లే ప్రయాణికుల పరంగా చూస్తే భారత్ టాప్ లో ఉంది. మొత్తం సంవత్సరంలో, భారతదేశం నుండి 60,000 మందికి పైగా ప్రయాణికులు రష్యా రాజధానిని సందర్శించారని మాస్కో సిటీ టూరిజం కమిటీ ఛైర్మన్ ఎవ్జెనీ కోజ్లోవ్ వెల్లడించారు.