* అజర్‌బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్
బాకు, డిసెంబర్ 29: కజకిస్తాన్ లోని అక్టౌ నగరంలో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయి 38 మంది చనిపోవడానికి రష్యానే కారణమని అజర్‌బైజార్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే విమానం ప్రమాదానికి గురైందన్నారు.
విమాన ప్రమాదానికి గల కారణాలను మాస్కో దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమాయకులు ప్రాణాలో కోల్పోవడానికి బాధ్యత వహిస్తూ రష్యా చేసిన తప్పును ఒప్పుకోవాలని అలియేవ్ డిమాండ్ చేశారు. విమాన ప్రమాదానికి గల కారణాలను దాచేందుకు రష్యాలోని ఓ వర్గం అసత్య ప్రచారం చేస్తుందన్నారు.
ప్రమాదం జరడానికి కారణం ఒకటైతే.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాస్కో చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయని ఆరోపించారు. చేసిన తప్పును అంగీకరించడం, అజర్ బైజాన్‌కు క్షమాపన చెప్పడం, ప్రమాదం ఎలా జరిగిందో ప్రజలకు చెప్పాలని రష్యాకు అలియేవ్ సూచించారు.
కాగా ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్నీ సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగించడంతో అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి.