14-04-2025 01:45:27 AM
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విజయక్రాం తి): రాష్ట్రవిద్యాశాఖ హడావుడిగా పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాలను మూ ల్యాంకనం చేయిస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ తో 50 వరకు పత్రాలను మూల్యాంకనం చేయిస్తుండడంతో వాల్యుయేషన్‌పై విద్యారులు, వారి తల్లిదండ్రులు అనేక అనుమా నాలు వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఒ క్కో ఎగ్జామినర్ రోజుకు 40 వరకు పత్రాలు మాత్రమే మూల్యాంకనం చేయాల్సి ఉం టుంది. కానీ.. ఇప్పుడు కొన్నిచోట్ల గరిష్ఠంగా గరిష్ఠంగా 60 పత్రాలు మూల్యాంకనం అవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ నెల 7 నుంచి జవాబు పత్రాల మూ ల్యాంకనం ప్రారంభం కాగా, నిర్దేశిత గడువు మూల్యాంకనం చేయాలని విద్యాశాఖ ఎగ్జామినర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
దీంతో ఒత్తిడి భరించలేక వారు హడావుడిగా మూల్యాంకనం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మూల్యాంకన కేంద్రాల్లో మరీ ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మంగళవారం(15వ తేదీ)తో మూల్యాంకన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉం డగా, మెజార్టీ జిల్లాల్లో ఇప్పటికీ సోషల్, ఇంగ్లిష్ పేపర్ల మూల్యాంకనం పెండింగ్‌లో ఉన్నట్లు బోగట్టా.
దీనిపై ‘విజయక్రాంతి’ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. మూ ల్యాంకనం విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినంది కావడంతో ఎగ్జామినర్లకు తగి నంత సమయమివ్వాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
స్క్రూటీనైజర్లపై పనిభారం..
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పదోతర గతి మూల్యాంకన కేంద్రాల్లో విధులు నిర్వర్తిస్తున్న స్క్రూటీనైజర్లపైనా విద్యాశాఖ భారం మోపుతున్నదని సమాచారం. పని ఒత్తిడి తట్టుకోలేక కొందరు స్క్రూటీనైజర్లు విధులకు డుమ్మా కొడుతున్నారని తెలిసింది. సాధారణంగా వీరు ఎగ్జామినర్లు మూల్యాంకనం చేసిన తర్వాత, మార్కులను క్రోడీకరిం చాల్సి ఉంటుంది.
ప్రస్తుతం ఒక్కో స్క్రూటీనైజర్ రోజుకు 200 జవాబు పత్రాలను స్క్రూట్నీ చేస్తున్నారని, ఫలితంగా వారిపై ఒత్తిడి పెరుగుతున్నదని తెలుస్తున్నది. మరోవైపు మూల్యాంకన పారితోషికాన్ని పెంచా లని ఎగ్జామినర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఒక పేపర్‌కు రూ.10, కన్వెయన్స్‌కింద రోజుకు రూ.50 మాత్రమే ఇస్తు న్నారని, రోజుకు రూ.500 చొప్పున పారితోషికం చెల్లించాలని, టీడీ, డీఏ సైతం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది పారితోషికం ఈ నెల మొదటివారంలో విడుదలయ్యాయని, కొంతమందికి ఇప్పటికీ ఆ పారితోషికం అందలేదని వాపోతున్నారు.