23-03-2025 01:56:22 PM
చివరి వారం 'జనసంద్రం'
బెల్లంపల్లి,(విజయక్రాంతి): పోచమ్మ తల్లి, మా పిల్లాపాపలను సల్లంగా చూడు. బెల్లం, కోడి, కల్లు, శాకం, మొక్కులన్నీ తీర్చుకునేందుకు నీ సన్నిధికి వచ్చాము, పిల్లాపాపలతో ప్రణమిల్లుతున్నాము. ఆపదలన్ని తీర్చి అండగా మా యందు నిలువు. అంటూ ఆదివారం బెల్లంపల్లి పోచమ్మ దేవాలయం వద్ద భక్తులు ఘనంగా మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు దేవాలయ ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. కొత్త బట్టలు నైవేద్యాలతో పాటు కోళ్ళు ,మేకలను. అమ్మవారికి సమర్పించి ఘనమైన ముక్కులను చెల్లించుకున్నారు . సింగరేణి కార్మికులు పిల్లాపాపలతో పోచమ్మ మొక్కులు తీర్చుకున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులతో బెల్లంపల్లిలోని పోచమ్మ దేవాలయం జనసంద్రంగా దర్శనమిచ్చింది. కన్నెపల్లి మండలంలోని ఎల్లారం పోచమ్మ దేవాలయం కూడా ఆదివారం భక్తులతో పోటెత్తింది.