22-03-2025 10:38:19 PM
మెదక్/కొల్చారం: వర్షానికి ఈదురు గాళ్లకు కొల్చారం మండలంలోని అప్పాజీపల్లి, పొతం శెట్టిపల్లి టీ జంక్షన్ వద్ద ఉన్న వ్యాపార సముదాయాల హోటల్లు కూలి అలాగే పెద్దపెద్ద స్తంభాలు ఇరిగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక విద్యుత్ తో పాటు రూరల్ జోనల్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి ఆధ్వర్యంలో మెదక్ డిఈ భాష, ఏడి రమణారెడ్డిల ఆధ్వర్యంలో విస్తృతంగా శ్రమించి విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఈ సందర్భంలో వారికి స్థానిక నాయకులు సైతం సహకరిస్తామని హామీ ఇచ్చారు.
త్వరితగతిన పనులు పూర్తి చేసి ఏడుపాయల దేవస్థానానికి టీ జంక్షన్ కి విద్యుత్ స్తంభించిన పరిసర గ్రామాలకు కూడా విద్యుత్ అందించాలని కోరగా రూరల్ జోన్ చీఫ్ ఇంజనీర్ బాలస్వామి స్థానిక విద్యుత్ అధికారులతో కాంట్రాక్టర్ సాయిబాబా గౌడ్ సంగమేశ్వర్ రెడ్డితో పనిచేస్తూ పర్యవేక్షించి మధ్యాహ్నం మూడు గంటల వరకు విద్యుత్ సప్లై అందిస్తామని హామీ ఇచ్చి సరఫరా అందించారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుల గారి మల్లేశం గౌడ్, తాజా మాజీ సర్పంచ్ నాగరాణి నర్సింలు, మాజీ ఎంపీటీసీ సిద్ధిరాములు, మాజీ ఏడుపాయల డైరెక్టర్ గౌరీ శంకర్, నాగయ్య, నాని, గడ్డమీద మహేష్, మలికే ప్రవీణ్ కుమార్, బిజెపి నాయకులు నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి పెద్ద ఎత్తున ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టగా విద్యుత్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.