calender_icon.png 7 October, 2024 | 7:07 PM

గ్రామీణ క్రీడల అభివృద్ధి లక్ష్యం

07-10-2024 04:13:05 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. నవంబర్ లో నిర్వహించనున్న సీఎం కప్ కు సంబంధించి గచ్చిబౌలి స్పోర్ట్స్ అధికారి అలెగ్జాండర్, ర్యాలీ నోడల్ అధికారి సీఐ కన్నం మధుబాబుల ఆద్వర్యంలో ఒలంపిక్ జ్యోతి ర్యాలీ జిల్లా కేంద్రానికి చేరుకోగా జిల్లా క్రీడల అధికారిని రమాదేవి అధ్యక్షతన ర్యాలీకి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి తో కలిసి క్రీడా జ్యోతి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తారీఖు వరకు ర్యాలీ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను అభివృద్ధి చేయడానికి, గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి కప్ తెలిపారు. ఈ క్రీడలతో క్రీడాకారులు సమూహస్ఫూర్తి పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు మాజీ జెడ్పిటిసి సంతోష్, మాజీ ఎంపీపీలు బాలేష్ గౌడ్, మల్లికార్జున్, కాంగ్రెస్ నాయకులు చరణ్, అబ్దుల్లా, శ్యామ్, కోచులు తిరుపతి, రాకేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.