calender_icon.png 14 February, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ రోడ్లకు మరమ్మతులు చేయాలి

14-02-2025 12:30:55 AM

నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా

 నారాయణఖేడ్, ఫిబ్రవరి 13: కల్హేర్  మండలం మాసంపల్లి జాతీయ రహదారిపై నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే ఏం.భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో  ధర్నా రాస్తారోకో  నిర్వహించారు. గురువారం కల్హేర్ మండలంలోని సంగారెడ్డి -నాందేడ్ జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. కల్హేర్ మండలంలోని పలు గ్రామాలకు సంబంధించిన బీటి రోడ్లను నిర్మించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు సంబంధిత అనుమతులు తీసుకురావడం జరిగిందన్నారు.

అప్పట్లో ఎన్నికల కోడ్ కారణంగా పనులు నిలిచిపోవడం జరిగిందన్నారు. సంబంధిత రోడ్లను మళ్లీ కొనసాగించాలని ఆయన స్థానిక ఎమ్మెల్యేను డిమాండ్ చేశారు. లేనిచో తాము మరిన్ని ఆందోళన కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు డాక్టర్ అలీ ,మాజీ ఆత్మ చైర్మన్ దిలీప్ కుమార్, మాజీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దుర్గారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అంజిరెడ్డి, మాజీ సర్పంచులు బాలయ్య, గోపాల్ రెడ్డి, గణపతి, రాములు నాయక్, దేవయ్య, మొగులయ్య, గంగారెడ్డి,  చంద్రప్ప వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.