calender_icon.png 21 April, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈదురు గాలులు.. భారీ వర్షం

21-04-2025 12:00:00 AM

గ్రామీణ రహదారులు జలమయం

ఓరిగిన విద్యుత్ స్థంబాలు, నెల రాలిన మామిడి 

కడ్తాల్, ఏప్రిల్ 20 : రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కర్కల్ పహాడ్ గ్రా మంలో విద్యుత్ స్థంబాలు గాలికి ఒరిగాయి. మైసిగండి మైసమ్మ ఆలయ పరిసరాల్లో రహదారులు బురద మయంగా మారాయి. హైదరాబాద్ - శ్రీశైలం రహదారి కడ్తాల్ మండలంలో టోల్ ప్లాజా సమీపంలో ఓ వృక్ష్యం జాతీయ రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మండలంలో పలు గ్రామాల్లో పంటలు నష్టపోయాయి. అదేవిధంగా మక్త మాధారం - నాగిరెడ్డి గూడా తండా రోడ్డు నూతనంగా ఏర్పాటు చేసిన కల్వర్టు వద్ద కోతకు గురైం ది. కడ్తాల్ మండలంలో ఆయా గ్రామాల్లో మట్టి రహదారులు భారీ వర్షం కారణంగా బురదమయంగా మారాయి.