calender_icon.png 28 December, 2024 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె ప్రకృతి వనం కబ్జా

05-11-2024 01:01:39 AM

సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం 679 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసిం ది. కోదాడ నియోజకవర్గ పరిధిలోని అనంతగిరి మండలం ఖానాపురంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం కబ్జాకు గురైంది. పల్లె ప్రకృతి వనంలో ఉన్న మొక్కలను తొలగించిన అక్రమార్కులు సేద్యం చేశారు. పల్లె ప్రకృతి వనానికి కేటాయించిన ప్రభుత్వం భూమి ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోవడంలేదు. ఈ విషయంపై గ్రామ కార్యదర్శి అక్షయ్‌తేజను వివరణ కోరగా పల్లె ప్రకృతి వనం కబ్జాపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

- అనంతగిరి, నవంబర్ 4