calender_icon.png 31 January, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె ప్రకృతి వనాలను తీర్చిదిద్దాలి: కలెక్టర్

29-01-2025 01:34:59 AM

జగిత్యాల, జనవరి 28 (విజయ క్రాంతి): పల్లె ప్రకృతి వనాలలో  అందమైన పూలు, పండ్ల మొక్కలను నాటి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మంగళవారం  ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో బహత్ పల్లె ప్రకతి వనం పనులను, వైకుంఠ ధామం, కంపోస్ట్ ఎరువులు, డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బహత్ పల్లె  ప్రకతి వనంలో పిచ్చి మొక్కలను తొలగించాలని, రకరకాల పండ్ల, పూల చెట్లను పెంచాలని సూచించారు.

వైకుంఠధామం పరిశీలించి ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, నీటి సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. స్నానాల గదులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలన్నారు. ప్రహరీ గోడ వరకు పూర్తి స్థాయిలో పిచ్చి మొక్కలు తొలగించి మంచి అందమైన,  సువాసన గల పూల మొక్కలను పెట్టాలని కలెక్టర్ సూచించారు. డంపింగ్ యార్డ్ కంపోస్ట్ షెడ్ పరిశీలించి తడి చెత్త, పొడి చెత్త వేరు వేరుగా సేకరించాలని పేర్కొన్నారు.

అనంతరం వెల్కటూర్ మండలం చెగ్యాం గ్రామంలో నర్సరీని,  జామ తోటను  పరిశీలించి, పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. ఉన్న మొక్కలను రక్షించడంతో పాటూ మరికొన్ని రకాల పండ్ల మొక్కలను పెంచాలని సూచించారు. ప్రజల శారీరక ఆరోగ్యంతో పాటూ మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం కోసమే ఈ పల్లె ప్రకతి వనాలని పేర్కొన్నారు.

నర్సరీలు పల్లె ప్రకతి వనాలకు, గ్రామాల్లోని రోడ్లకు వీధులకు అవసరమైన మొక్కలను అందించే రీతిలో అభివద్ధి పరచాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీపీఓ మదన్మోహన్, ఎండపల్లి ఎమ్మార్వో రవికాంత్, వెల్గటూరు ఎమ్మార్వో శేఖర్, ఎంపీడీవోలు ఎంపీవోలు, ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు.