calender_icon.png 6 April, 2025 | 6:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె దవాఖానలతో ప్రజల చెంతకే వైద్యం

05-04-2025 01:46:06 AM

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్‌రావు

నిజాంపేట (రామాయంపేట), ఏప్రిల్ 4:నిజాంపేట మండలంలో పల్లె దవాఖానను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సంబంధిత ప్రజా ప్రతినిధులు వైద్యాధికారులు, సిబ్బం దితో కలిసి ప్రారంభించారు. ముందుగా ఆరోగ్య కేంద్రంలో బీపీ మిషన్ తో  పరీక్ష  చేయించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వ ఆస్పత్రులలో నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. రూ.20 లక్షల వ్యయంతో పల్లె ధావకాన నిర్మాణం జరిగినట్లు పేర్కొన్నారు.  నగరాలకు వెళ్ళి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చుపెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరిప్రియ, సంబంధిత ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బందిపాల్గొన్నారు.