calender_icon.png 23 September, 2024 | 4:04 AM

గ్రామీణ హస్తకళలను కాపాడుకోవాలి

23-09-2024 02:07:28 AM

హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ సత్యనారాయణ

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రాంతాల్లోని హస్తకళలను కాపాడుకోవాల ని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం స్ఫూర్తి స్కీమ్ ద్వారా మంజూరైన పెంబర్తి మెటల్ వేర్ క్లస్టర్‌లో హస్త కళాకారుల కోసం ఉత్పత్తుల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని సీఐఆర్‌డీ ఏపీ డైరెక్టర్ డా.చంద్రశేఖర్, కేంద్ర చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల డైరెక్టర్ జనరల్ డా. ఎస్ గ్లోరీలతో కలిసి నాయుడు సత్యనారాయణ ఆదివారం ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నత్యనారాయణ మాట్లాడు తూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా అధునా తన పరికరాలు, మార్కెటింగ్, హస్తకళల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నా మని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీటి అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.