- ఖమ్మం జిల్లాలో సాగుతున్న నిర్మాణ పనులు
- ప్రారంభమైన ఆ కొద్ది పనుల్లోనే బోలెడు అవినీతి
- నిధుల కొరతే కారణమంటున్న ఉన్నతాధికారులు
- చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు.. కొన్నిచోట్ల సబ్ కాంట్రాక్టులు
ఖమ్మం, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ‘ప్రతి పంచాయతీలో సర్కార్ దవాఖాన ఉం డాలి. పల్లె ప్రజలకు ప్రజావైద్యం అందుబాటులో ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉం డాలి’ అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం గ్రామా ల్లో పల్లె దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
ఒక్కో గ్రామంలో ఒక్కో భవన నిర్మాణానికి రూ.25 లక్షల చొప్పున కేటాయించాలని నిర్ణయించింది. ఖమ్మం జిల్లా లో చేపట్టిన పల్లె దవాఖానల పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్న ట్లు విమర్శలు ఉన్నాయి. చేపట్టిన ఆ కొద్దీ పనుల్లో సైతం కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని, అలాగే రూ.కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి.
నియోజకవర్గాల్లో ఇలా..
సత్తుపల్లి, ఖమ్మం, మధిర, వైరా నియోజకవర్గాలో పల్లె దవాఖానల నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. చాలా చోట్ల పిల్లర్ల దశలోనే పనులు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల పిల్లర్ల దశ దాటినా, మిగతా పనులు ముందుకు కదలడం లేదు. అందు కు ప్రధాన కారణం నిధుల సమస్యేనని అధికారులు పేర్కొంటున్నారు.
నిధుల లేమితో విసిగిన కాంట్రాక్టర్లు సైతం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. కొందరు కాంట్రాక్టర్లు ఆ పనులను సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించిన విష యాలు వెలుగులోకి వస్తున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గంలో చేపట్టిన పల్లె దవాఖానల నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వున్నాయి.
సత్తుపల్లి మండలంలోని రేజర్ల, గంగారం, వేంసూరు మండలంలోని కేజీ మల్లేల, పెనుబల్లి మండలం కారాయిగూడెం గ్రామాల్లో దవాఖానలు ఇప్పటికీ పూర్తి కాకపోవడంపై ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వాటి వైపు కన్నెత్తి అయినా చూడడం లేదంటున్నారు.
నత్తనడకన పనులు..
జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల నిర్మాణా లు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. మరికొన్ని నిర్మాణాలు సగభాగం పూర్త యి ఉన్నాయి. తొలుత పనులను పంచాయతీరాజ్ శాఖ అధికారులు పర్యవేక్షిం చగా, ప్రభుత్వం తర్వాత ఆ బాధ్యతలను టీఎస్ ఎంఐడీసీకి బదలాయించింది. ఆ శాఖ అధికారులు పనులు నాసిరకంగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
చిన్న చిన్న ఆరోపణలపై స్పందించే విజిలెన్స్ అధికారులు పల్లె దవాఖానల విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, పల్లె దవాఖానల నిర్మాణంలో అవినీతి అక్రమాలు తేల్చాలని, తర్వాత సత్వరం పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
పనులపై డీఈ విద్యాసాగర్‌ను వివరణ కోరగా.. నిధుల కొరత కారణంగానే పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగా నే పనులు పూర్తి చేస్తామని సమాధానమిచ్చారు. పనులను సబ్ కాంట్రాక్ట్‌కు ఇవ్వ డం కూడా పనుల ఆలస్యానికి ఓ కారణమన్నారు. నిర్మాణాలపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారించి, ఆ తర్వాత చర్య లు తీసుకుంటామన్నారు.