calender_icon.png 10 January, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం

23-07-2024 01:01:19 AM

  • ౩1 మందికి పంపిణీ చేసిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి  

హుజూరాబాద్, జూలై 22 : హుజూరాబాద్ పట్టణంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన చిరు వ్యాపారులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతాన్ని సోమవారం బాధితులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ౩౧ మందికి రూ.3.10 లక్షలను పంపిణీచేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాల్పడుతూ.. బాధితులకు ఆర్థిక సహాయం అందజేయడంతోపాటు రేకుల షెడ్ల నిర్మాణానికి రూ.లక్ష ఇస్తానని హామీ ఇచ్చారు.

అగ్ని ప్రమాదంపై ఆర్డీవో, తహశీల్దార్, ము న్సిపల్ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నా కనీస నష్టపరిహారం మంజూరు చేయకపోవడం బాధాకరమని అన్నారు. మంత్రి పొన్నం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించకపోవడం, కనీ సం ఓ ప్రకటన కూడా చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక, వైస్ చైర్‌పర్సన్ నిర్మల, కౌన్సిలర్ లావణ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.