calender_icon.png 30 October, 2024 | 5:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.50 కోట్లు ఇచ్చి చేర్చుకుంటున్నరు

18-07-2024 03:21:38 AM

  • బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు వెల కట్టిన కాంగ్రెస్ 
  • పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి

యాదాద్రి భువనగిరి, జూలై 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.50 కోట్లు ధర నిర్ణయించి, ఆ పార్టీలో చేర్చుకుంటున్నారని బీఆర్‌ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కంచ ర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం అప్పట్లో తమ పార్టీ చేసిన పొరపాటని, అటువంటి తప్పులకే నేడు తాము ఓటమి చెందామని  అభి ప్రాయపడ్డారు. బుధవారం ఆయన భువన గిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడు తూ.. అప్పుడు బీఆర్‌ఎస్ చేసిన తప్పులనే ఇప్పు డు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తోందన్నారు.

ఈ తప్పు కారణంగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దివాళాకోరు విధానంతో ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి పార్టీలో చేర్చుకుంటున్నారని మండిపడ్డారు.  కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రజల్లో అభద్రత వచ్చిందన్నారు. ఎకరం రూ.కోటి గల భూముని ప్రస్తుతం రూ.25 లక్షలకు కూడా కొనే దిక్కులేదన్నా రు. ఇటువంటి పరిస్థితిల్లో రిజిస్ట్రేషన్ ధరల పెంపును ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలియక మంత్రులు ఎవరికి వారు ట్యాక్స్‌ల పేరిట వసూళ్లకు పాల్పడుతున్నారని కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రుణమాఫీ అమలు లో నిబంధనల పేరిట ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు జడల అమరేందర్, కొల్పుల అమరేందర్, అతికం లక్ష్మీ నారాయణ, ఇట్టబోయిన గోపాల్,  సూదగాని హరిశంకర్, కంచి మల్లయ్య, ఎన బోయిన అంజనేయులు, ఏవీ కిరణ్‌కుమా ర్, జనగాం పాండు, తాడెం రాజశేఖర్, తా డూరి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.