ముంబై, నవంబర్ 14: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించి న నేపథ్యంలో యూఎస్ డాలర్ భారీ ర్యాలీ జరుపుతున్న కారణంగా భారత్‌తో సహా వర్థమాన దేశాల కరెన్సీలన్నీ పతనమవున్నాయి. ఈ క్రమంలో గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కె ట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపా యి విలువ సరికొత్త కనిష్ఠస్థాయిని నమోదుచేసింది. మరో 7 పైసలు క్షీణించి 84.46 వద్ద నిలిచింది.
ట్రంప్ గెలుపు తర్వాత దేశీయ కరెన్సీ 40 పైసల వరకూ కోల్పోయింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా నిధులు తరలించడం కూడా రూపాయిపై ప్రభా వం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. యూఎస్ కేంద్ర బ్యాంక్ మరోదఫా వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలతో అంతర్జాతీయ ఫైనాన్షియల్ మార్కెట్లలో మార్పు చోటు చేసుకుంటున్నందున రూపాయి విలువ తగ్గుతున్నదని ఫారెక్స్ డీలర్లు తెలిపారు.