ముంబై, జూలై 18: ప్రపంచ మార్కెట్లో డాలరు బలం పుంజుకోవడం, క్రూడాయిల్ ధరలు పెరగ డంతో డాలరు మారకంలో రూపాయి విలువ రికార్డు కనిష్ఠస్థాయికి పడిపోయింది.. గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో ఇంట్రాడేలో పైసలు క్షీణించి 83.66 వద్ద కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 6 పైసలు కోల్పోయి 83.64 వద్ద ముగిసింది. ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రధమం. గత నెల మూడోవారంలో ముగింపు 83.61 స్థాయి నుంచి కరెన్సీ మరింత తగ్గింది. పటిష్ఠమైన యూఎస్ డాలర్‌కు తోడు ఆసియా, యూరప్ కరెన్సీలు బలహీనపడినందున, సమీప భవిష్యత్తులో రూపాయి దిగువస్థాయిలోనే ఉంటు ందని అంచనా వేస్తున్నట్టు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.