calender_icon.png 1 January, 2025 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రికార్డు కనిష్ఠంనుంచి రూపాయి రికవరీ

04-12-2024 12:00:00 AM

ముంబై, డిసెంబర్ 3: అదేపనిగా పడుతూ వస్తున్న రూపాయి మంగళవారం ఉదయం మరింత దిగజారి డాలరు మారకంలో 84.76 రికార్డు కనిష్ఠానికి పడిపోయి, ట్రేడింగ్ ముగిం పు సమయంలో కొంత కోలుకున్నది.

ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ 84.76 84.65 మధ్య స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనై చివరకు క్రితం ముగిం పుతో పోలిస్తే 4 పైసల లాభంతో 84.68 వద్ద నిలిచింది. దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీ జరిపిన నేపథ్యంలో రూపాయి పాజిటివ్‌గా ముగిసిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.