డాలరు మారకంలో 84.47కు తగ్గిన కరెన్సీ విలువ
ముంబై, నవంబర్ 28: గతవారం చవిచూసిన రికార్డు కనిష్ఠస్థాయిని రూపాయి గురువారం మరోసారి తాకింది. నవంబర్ 21న డాలరు మారకంలో రూపాయి 84.50 కొత్త కనిష్ఠస్థాయిని తాకిన తర్వాత క్రమేపీ 84,35 వద్దకు కోలుకున్నది. అయితే ఈ బుధ, గురువారాల్లో వేగంగా పడిపోయింది.
యూఎస్ డాలర్ బలోపేతం అవు తున్నందున, భారత్‌తో సహా వర్థమాన దేశాల కరెన్సీలన్నీ పతనమవుతున్న క్రమం లో రూపాయి క్షీణతను చవిచూస్తున్న సంగ తి తెలిసిందే. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ 84.49 రికార్డు కనిష్ఠస్థాయికి తగ్గింది.
చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 7 పైసల నష్టంతో 84.47 వద్ద నిలిచింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా తగ్గడం, విదేశీ సంస్థాగత ఇన్వెసర్లు పెద్ద ఎత్తున నిధుల్ని వెనక్కు తీసుకోవడం రూపాయి తాజా క్షీణతకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.