calender_icon.png 13 January, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడీపీ ఎఫెక్ట్ కొత్త కనిష్ఠానికి రూపాయి

30-11-2024 12:00:00 AM

డాలరు మారకంలో 84.60కు తగ్గిన కరెన్సీ విలువ

ముంబై, నవంబర్ 29: నిరుత్సాహకర జీడీపీ గణాంకాలు రూపాయిని రికార్డు కనిష్ఠస్థాయికి పడదోసాయి. ఇప్పటికే  దేశం నుంచి విదేశీ ఈక్విటీ పెట్టుబడులు తరలివెళుతున్న నేపథ్యంలో బలహీ నపడుతున్న కరెన్సీ..క్యూ2లో జీడీపీ రెండేండ్ల కనిష్ఠస్థాయికి తగ్గడం, ద్రవ్యలోటు పెరగడం, మౌలిక రంగాల వృద్ధి రేటు మందగించడం తదితర తాజా గణాంకాలతో మరింతగా తగ్గింది. 

శుక్రవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మారకం లో రూపాయి విలువ మరో 13పైసలు కోల్పోయి రికార్డు కనిష్ఠం  84.60 వద్ద నిలిచింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీగా తగ్గడం, విదేశీ సంస్థాగత ఇన్వెసర్లు పెద్ద ఎత్తున నిధుల్ని వెనక్కు తీసుకోవడం రూపాయి తాజా క్షీణతకు కారణమని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.