ఒక్క రోజులో 22 పైసలు పతనం
ముంబై, నవంబర్ 6: అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన నేపథ్యంలో యూఎస్ డాలర్ భారీ ర్యాలీ జరపడంతో భారత్‌తో సహా వర్థమాన దేశాల కరెన్సీ లన్నీ పతనమయ్యాయి. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది.
ఈ ఒక్కరోజులోనే 22 పైసలు క్షీణించి 84.31 వద్ద నిలిచింది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు అదేపనిగా నిధులు తరలించడం కూడా రూపాయిపై ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.