calender_icon.png 24 December, 2024 | 12:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి విలవిల

20-12-2024 12:56:51 AM

రికార్డు కనిష్ఠస్థాయికి కరెన్సీ విలువ

ముంబై, డిసెంబర్ 19: డాలర్ బలోపే తం అవుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇతర వర్థమాన కరెన్సీల బాటలోనే పడిపోతున్న రూపాయి గురువారం మరింత భారీ క్షీణతను చవిచూసి సరికొత్త కనిష్ఠస్థాయిని చూసింది. యూఎస్ కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని వెల్లడించడంతో డాలరు విలువ రెండేండ్ల గరిష్ఠస్థాయి కి చేరింది. దీనితో  ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ 85 దిగువకు పడి పోయింది.

అనూహ్యంగా 1౯ పైసలు నష్టపో యి రికార్డు కనిష్ఠస్థాయి 85.౧౩ వద్ద ముగిసింది. ఈ నెలలో ఇప్పటివరకూ  రూపాయి 45 పైసల మేర నష్టపోయింది. యూఎస్ ఫెడ్ బుధవారం పాలసీ సమీక్షలో పావుశాతం వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, వచ్చే ఏడాది రెండు దఫాలు మాత్రమే రేట్ల కోత లు ఉంటాయన్న సంకేతాల్ని వెల్లడించడంతో ప్రపంచ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 108 స్థాయిని దాటేసింది. ఫెడ్ కఠిన వైఖరి కారణంగా రూపాయి సమీప భవిష్యత్తులో బలహీనంగానే ట్రేడవుతుందని మిరే అసెట్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు.