డాలరు మారకంలో 84.50కు తగ్గిన కరెన్సీ విలువ
ముంబై, నవంబర్ 21: అదానీ గ్రూప్ సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో భారత కరెన్సీ కొత్త కనిష్ఠస్థాయికి పడిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ విజ యం సాధించిన నేపథ్యంలో యూఎస్ డాల ర్ భారీ ర్యాలీ జరుపుతున్న కారణంగా భారత్‌తో సహా వర్థమాన దేశాల కరెన్సీలన్నీ పతనమవుతున్న క్రమంలో రూపాయి క్షీణ తను చవిచూస్తున్న సంగతి తెలిసిందే.
రోజు కు 1,2 పైసలు చొప్పున కోల్పోతున్న రూపాయి గురువారం మాత్రం 6 పైసల క్షీణతను చవిచూసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారి న్ ఎక్సేంజ్ మార్కెట్లో (ఫారెక్స్)డాలరు మారకంలో రూపాయి విలువ 84.50 రికా ర్డు కనిష్ఠస్థాయికి తగ్గింది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం తీవ్రతరంకావడంత సురక్షిత కరెన్సీగా పరిగణించే అమెరికా డాలర్ బలో పేతం అవుతున్నదని ఫారెక్స్ డీలర్లు చెప్పా రు.
దీనికి తోడు దేశీయ మార్కెట్ నుంచి విదేశీ నిధులు తరలివెళుతున్నందున రూపా యిపై ఒత్తిడి ఏర్పడుతున్నదన్నారు. నవం బర్ 14న నమోదైన 84.46 కనిష్ఠస్థాయి దిగువకు తాజాగా రూపాయి విలువ క్షీణిం చింది. ట్రంప్ గెలుపు తర్వాత దేశీయ కరెన్సీ ఇప్పటివరకూ 46 పైసలు కోల్పోయింది.