calender_icon.png 13 January, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి మరింత పతనం

01-01-2025 12:00:00 AM

కొత్త కనిష్ఠస్థాయి 85.64 వద్ద ముగింపు

ముంబై, డిసెంబర్ 31: రూపాయి విలువ క్షీణత కొనసాగుతున్నది. డాలర్ బలోపేతంకావడం, దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధులు తరలించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరగడం రూపాయి క్షీణతకు కారణమవుతున్నాయి. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ మార్కెట్లో  (ఫారెక్స్)డాలరు మా రకంలో రూపాయి విలువ మరో 12 పైసలు క్షీణించి 85.64 వద్ద ముగిసింది.

మూడు రోజుల క్రితం 85.80 ఆల్‌టైమ్ కనిష్టస్థాయికి పడిపోయినప్పటికీ, ఆ రోజున రూపా యి విలువ 85.53 వద్ద ముగిసింది. కానీ 85.64 స్థాయి వద్ద ముగియడం ఇదే ప్రధ మం.

వడ్డీ రేట్ల కోతలపై ఫెడరల్ రిజర్వ్ అం చనాలు తగ్గడం, ట్రంప్ పాటించబోయే వా ణిజ్య విధనాలపై అంచనాలతో డాలర్ ఇం డెక్స్, యూఎస్ 10 ఏండ్ల బాండ్ ఈల్డ్స్ పె రుగుతున్నాయని, దీనితో రూపాయి విలువ క్షీణిస్తున్నదని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. అలాగే దేశీయ జీడీపీ వృద్ధి తగ్గుదల, వాణిజ్యలోటు పెరుగుదల, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు రూపాయిని ప్రభావితం చేస్తున్నాయన్నారు. 

పతనం ఇలా..

ఈ ఏడాది అక్టోబర్ 10న రూపాయి కీలకమైన 84 స్థాయిని కోల్పోగా, డిసెంబర్ 19న 85 స్థాయి దిగువకు జారిపోయింది. డిసెంబర్ 27న ఇంట్రాడేలో గత రెండేండ్లలో ఎన్నడూచూడనిరీతిలో పతనమై 85. 80 ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకింది. డాలర్ బ లం, క్రూడ్ ధరల పెరుగుదల, దిగుమతిదార్ల నుంచి డాలర్ల డిమాండ్ తదితర అంశాలతో సమీప భవిష్యత్తులో రూపాయి బలహీనంగానే ట్రేడవుతుందని మిరే అసెట్ షేర్‌ఖాన్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు.