calender_icon.png 28 October, 2024 | 8:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరిగి రికార్డు కనిష్ఠంవైపు రూపాయి చూపు

27-06-2024 01:42:27 AM

  • 14 పైసలు కోల్పోయిన కరెన్సీ

ముంబై, జూన్ 26: గతవారపు రికార్డు కనిష్ఠస్థాయి నుంచి క్రమేపీ కోలుకున్న రూపాయి తిరిగి పతనబాట పట్టింది. డాలరు మారకంలో రూపాయి విలువ బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో ఇంట్రాడేలో ఒక్కసారిగా 18 పైసలు క్షీణించి 83.61 కనిష్ఠస్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 14 పైసలు కోల్పోయి 83.57 వద్ద ముగిసింది. గతవారం చరిత్రాత్మక కనిష్ఠస్థాయి 83.68 వద్ద కనిష్ఠస్థాయిని తాకి,  అదే రోజున 83.61 వద్ద నిలిచిన తర్వాత క్రమేపీ కోలుకుని 83.43 స్థాయికి పెరిగినప్పటికీ, తాజాగా డాలర్లకు డిమాండ్ వెల్లు వెత్తడంతో కరెన్సీ భారీగా తగ్గిందని ఫారెక్స్ ట్రేడర్లు చెప్పారు. అమెరికా డాలరు బలపడ టం, క్రూడాయిల్ ధరలు గరిష్ఠస్థాయిలో కొనసాగడం రూపాయిని నష్టపర్చిందని బీఎన్‌పీ పారిబాస్ రీసెర్చ్ అనలిస్ట్ అనూజ్ చౌదరి చెప్పారు. వచ్చే కొద్ది రోజుల్లో యూఎస్ డాలర్/రూపాయి పెయిర్ 83.30 శ్రేణిలో ట్రేడ్ కావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 0.22 శాతం పెరిగి 105.83 స్థాయికి చేరగా, బ్రెంట్ క్రూడ్ ధర 0.80 శాతం ఎగిసి 85.70 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.