రూ.50 కోట్లు డిమాండ్
న్యూఢిల్లీ, నవంబర్ 12: ప్రముఖ నటి రూపాలీ గంగూలీ తన సవతి కూతురు ఈశా వర్మపై రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలించేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను తనకు నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఈశా తన సవతి తల్లిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రాం నుంచి డిలీట్ చేశారు. అశిన్ కే వర్మ 1997లో సప్న అనే మహిళను వివాహం చేసుకుని ఈశాతో పాటు మరో అమ్మాయికి జన్మనిచ్చారు. ఆయన 2013లో రూపాలీ గంగూలీని వివాహమాడారు.
ఈ క్రమంలోనే ఈశా ఓ వీడియోలో గంగూలీని తీవ్రంగా విమర్శించారు. తన తల్లికి విడాకులు ఇచ్చేలా తన తండ్రిపై ఒత్తిడి చేసినట్టు ఆరోపించారు.