calender_icon.png 26 December, 2024 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొడంగల్ లో అభివృద్ధి పనుల పరుగు

28-10-2024 03:41:31 PM

రూ. ఆరు కోట్లతో ఆర్అండ్ బీ అతిధి గృహానికి శంకుస్థాపన చేసిన కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తిరుపతి రెడ్డి

కొడంగల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషితో కొడంగల్ లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి అన్నారు. సోమవారం కొడంగల్ పట్టణంలోని సిటీజన్ క్లబ్ ఆవరణలో ప్రభుత్వ అతిధి గృహ నిర్మాణానికి రూ. ఆరుకోట్ల నిధులతో పనులు చేపట్టేందుకు  సీఎం సోదరుడు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి తిరుపతి రెడ్డి ప్రభుత్వ అతిధి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలోనే కొడంగల్ నియోజకవర్గ కేంద్రాన్ని ఆదర్శ వంతంగా తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యా, వైద్య రంగాలకు భారీ ఎత్తున నిధులు మంజూరు అయినట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలు చేపడతమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షుడు ఎన్, ప్రశాంత్, పీసీసి మెంబర్ యూసుఫ్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.