మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ కిరణ్
ముషీరాబాద్, ఫిబ్రవరి 5: సుప్రీంకోర్టు ఏడుగురు ధర్మాసనం ఇచ్చిన తీర్పు, ఏకసభ్య కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సిఫారుసుల ఆధారంగా క్రిమిలేయర్‌ను అమలు చేయాలని తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి చైర్మన్ క్రాంతికుమార్ మాదిగ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బుధవారం బర్కత్‌పురలోని రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సిఫారసుల ఆధారంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన ఎస్సీలను ఎస్సీ రిజర్వేషన్‌ల నుంచి మినహాయించి క్రిమిలేయర్‌ను అమలు చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి కమిటీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు.