calender_icon.png 28 December, 2024 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ సంక్షేమ పథకాలు.. ప్రజలకు తెలిపేందుకే 2కే రన్

03-12-2024 09:46:36 AM

సంగారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపేందుకే 2కే రన్ నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం సంగారెడ్డి పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 2కే రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు వాకింగ్ చేయడంతో ఆరోగ్యంగా ఉండడంతో పాటు ప్రశాంతంగా ఉంటారన్నారు. ప్రభుత్వం పథకాలను ప్రజలకు తెలిపేందుకే ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకాన్ని అర్హులైన వారికి అందించేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ మనోజ్, సంగారెడ్డి ఆర్డిఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.